డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ సినిమా ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’సినిమా చూశాను. చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. కానీ నాకు లోలోపల ఒక ఫీలింగ్ వచ్చింది. మనం ఒక సినిమా తీసి, చాలా కష్టపడి ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేస్తుంటాం. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ట్రైలర్ లేకుండానే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అది నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఒక దర్శకుడు తన కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ సినిమా చేయడమే గగనం. కానీ సింగీతం తీసిన ప్రతి సినిమా ఒక ల్యాండ్‌మార్క్. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రత్యేకమైన మైలురాయిఅని తెలిపారు. ''సావిత్రి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతంని కలిశాను. అలాంటి ఆయనను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండిపోయే మొమరీ అనుకున్నాను. కానీ ఆ జర్నీ ఇంతదూరం వస్తుందని ఎప్పుడూ ఊహించ లేదు. ఆయన కలకు తెరరూపం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాను మేమెప్పుడూ తీయలేదు అని నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పారు.
సింగీతం ప్రతి సినిమా ల్యాండ్ మార్కే..
- Advertisement -
- Advertisement -



