సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు.
ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన ఈ ట్రాక్‌తో అనిరుధ్ తన సంగీత ప్రపం చంలోని పరిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. వేగంగా మారుతోన్న డిజిటల్ సంగీత ప్రపంచంలో తన ప్రతిభను నిరూపించు కోవటానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ పడే కష్టాలను ప్రధానంగా ఆవిష్కరించారు అనిరుధ్.
ఈ సందర్బంగా అనిరుధ్ మాట్లాడుతూ, ”అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ తరహా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తోన్న ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుంది. అలాగే నేటి డిజిటల్ ప్రపంచంలో ఉన్న విపరీతమైన పోటీలో పెద్ద స్థాయికి చేరుకునే సమయంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఇది చూపిస్తుంది` అని అన్నారు. ఈ పాట ద్వారా ఇలాంటి ప్రయాణంలో ఉన్న ఇతర కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలని, అలాగే తన ఎదుగుదల, ఎదురైన సవాళ్ళకూడా ఈ పాట ద్వారా ఆయన తెలియజేయటం విశేషం.
‘అరవింద్’తో కొత్త అధ్యాయం
- Advertisement -
- Advertisement -



