నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మైనార్టీ గురుకులంలో చనిపోయిన విద్యార్థి ఆకాష్ కుటుంబానికి న్యాయం చేయాలని భువనగిరి ఏరియా హాస్పిటల్ రోడ్డు మీద ధర్నా చేశారు. అఖిలపక్షం నాయకులు తదనంతరం విద్యార్థి సంఘం నాయకులకు పోలీసులకు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వం నుంచి రెండు కోట్ల ఎక్స్గ్రేషియా, విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, విద్యార్థి ఆకాష్ మృతికి కారకులైన అధికారులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో చనిపోయిన విద్యార్థి ఆకాష్ కుటుంబ సభ్యులు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి,సుభాష్, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ ఎడ్ల మహలింగం యాదవ్, చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, అజయ్,అంజూత్, ఆగు అశోక్,బండారి రమేష్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఆకాష్ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



