ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో సోమవారం రోజు శ్రవణా నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల 30 నిమిషాలకు స్వర్ణగిరి క్షేత్రంలోని స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు, చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణల ఆదేశాల మేరకు గిరి ప్రదక్షణ యొక్క విశిష్టతను భక్తులకు వివరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి గోవింద నామాలను స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించు కుని దివ్యానుభూతిని పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచి నీరు , మజ్జిగను పంపిణీ చేశారు. అలాగే వచ్చేది వేసవికాలం దృశ భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లను ఏర్పాటు చేశారు.
శ్రవణా నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



