Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంసుప్రీం కోర్టులో ఐఎఎస్‌ శ్రీలక్ష్మికి చుక్కెదురు

సుప్రీం కోర్టులో ఐఎఎస్‌ శ్రీలక్ష్మికి చుక్కెదురు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వైసీపీ అధినేత వైఎస్‌.జగన్‌ అక్రమస్తుల కేసులో ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో తన పేరును తొలగించాలని కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ రిజెక్ట్‌ చేసింది. ఓబులాపురం గనుల కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లానని ఐఎఎస్‌ శ్రీలక్ష్మి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే శ్రీలక్ష్మి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమె మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని ధర్మాసనానికి సీబీఐ వెల్లడించింది. ఆమె లంచం కూడా డిమాండ్‌ చేసినట్టు సాక్ష్యాలు వాంగ్మూలం ఇచ్చారని సుప్రీం ధర్మాసనానికి సీబీఐ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -