- Advertisement -
- – పర్యవేక్షణాధికారి రాకముందే వాగులోకి ట్రాక్టర్లు..
– అధికారి వచ్చాక మళ్లీ యథావిథిగా అనుమతులతో ఇసుక రవాణ
నవతెలంగాణ-బెజ్జంకి:
అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ పలువురు ఇసుక ముఠాదారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కి అధికారుల కంటపడకుండా ఎత్తుకు..పైఎత్తు వేస్తూ సరికొత్త వ్యుహాలతో అక్రమ ఇసుక రవాణకు అడ్డదారులు వెతుకుంటున్నారు.అక్రమ ఇసుక రవాణను అరికట్టి..ప్రజావసరాలకనుగుణంగా ఇసుకను పారదర్శకంగా అందించడానికి సంబధిత అధికారుల పర్యవేక్షణలో ప్రభుత్వం నిబంధనలు రుపోదించి మన ఇసుక వాహనం అమలు చేస్తోంది.
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగులోకి పలువురు ఇసుక ముఠాదారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పర్యవేక్షణాధికారి(జీపీఓ)విధులకు రాకముందే ఉదయమే వాగులో వెళ్లి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని..పర్యవేక్షణాధికారి వచ్చాక యథావిథిగా అనుమతులంటూ ఇసుక తరలిస్తున్నారని విమర్శలు గ్రామంలో వినిపిస్తున్నాయి.అధికారుల అనుమతులకు ,ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలువురు ఇసుక ముఠాదారులపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసేల చట్టపరమైన చర్యలు చేపట్టాలని పలువురు స్థానికులు బుధవారం కోరారు.
- Advertisement -



