తెరుచుకొని కొయ్యుర్ సబ్ సెంటర్
మందుల్లేక వెలవేలబోతున్న తాడిచెర్ల ఆయుస్మాన్
ఇబ్బందుల్లో రోగులు
నవతెలంగాణ – మల్హర్ రావు
అన్ని ఉన్నా అల్లుడునోట్లో శని అన్నట్లుగా తయారైంది మండలంలో ఆయుష్ (యునాని) ఆయుర్వేద ఆసుపత్రి పరిస్థితి. ఆయుర్వేద ఆసుపత్రి కేంద్రాలు ఉత్సవ విగ్రహల్లా మారాయి. తాడిచెర్ల ఆసుపత్రిలోని సెంటర్ లో మందులు లేక వెలవేలబోతే,కొయ్యుర్ సబ్ సెంటర్ కు తాళం తీసే దిక్కులేదు ఫలితంగా రోగులు ఇబ్బందులకు గురివుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందిoచాలనే లక్ష్యం ఆయుస్మాన్ భవ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంబంధించిన ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా నిరీగారి ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మారింది. దీంతో ఆయుర్వేద సేవలు ఎక్కడాని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవ తెలంగాణ ఆయుస్మాన్ భవ కేంద్రాలపై ప్రత్యేక కథం.
మందుల,సిబ్బంది కొరత..
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ గదిలో ఆయుర్వేద ఆసుపత్రిని కేటాయించారు. ఇక్కడ వైద్యాధికారి,పార్మసీస్ట్, ఎస్ఎన్ఓ ఉండాలి కానీ ఒక తాత్కాలిక ఎన్ఆర్ హెచ్ఎం కంపండర్ మాత్రమే ఉంది ఇందుకు తోడుగా గదిలో మందులు ఖాళియై కొన్నేళ్ళు అవుతున్న పరిస్థితి. వళ్లెంకుంటలో కొనసాగుతున్న సబ్ సెంటర్ యునాని ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉండడంతో కూల్చివేశారు. ఈ కేంద్రాన్ని కొయ్యుర్ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్లోని ఓ గదిలోకి మార్చారు.ఇక్కడా వైద్యాధికారి,పార్మసీస్ట్,ఎస్ఎన్ఓ ఒక్కరు కూడా లేకపోగా, మందులు సైతం నిల్ కావడంతో సెంటర్ తాళం తీసేదిక్కులేదు. కూల్చిన భవనానికి సంబంధించిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో కానరాలేదు.
భూమి,నిధులు కేటాయించిన నిర్లక్ష్యం.
అస్మాన్ భవ సొంత భవనం నిర్మాణం చేపట్టాలని ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఎంఓ శ్రీనివాస్ ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా 15 ఏళ్ళ క్రితం కొయ్యుర్ ఐకెపి భవనం ముందు మూడు గుంటల ప్రభుత్వ స్థలం,ఆరేళ్ళ క్రితం టిఎస్ ఎంఐడిసి నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేశారు. భవన నిర్మాణ పనులు చేపట్టక పోవడంతో అప్పటి పాలకుల, అధికారుల నిర్లక్ష్యంగా నిధులు ల్యాప్స్ అయినట్లుగా తెలిసింది.
త్వరలోనే సర్దుబాటు చేస్తాం.. ప్రమిలా దేవి ఆడిట్ అధికారి, వరంగల్ ఆర్ డీడీ
తాడిచెర్ల ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యాధికారి,పార్మసీస్ట్,ఎస్ఎన్ఓ, కొయ్యుర్ సబ్ సెంటర్ లో విద్యాధికారి, పార్మసీస్ట్, ఎస్ఎంఓ లను త్వరలోనే సర్దుబాటు చేసి మందులు పంపిస్తాం. ఆయుర్వేద ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది.వళ్లెంకుంట సబ్ సెంటర్ కుల్చివేసిన నేపథ్యంలో తమకు లెటర్ అందించారని తెలిపారు. కానీ కూల్చిన కొద్దీ రోజుల్లో నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు.



