నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో మంగళవారం ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన చైర్పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి లను ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ సభ్యులతో కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పదని అన్నారు. పట్టణ ప్రజలు చైతన్యవంతులై ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతతో సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులనే ఎన్నుకున్నారని అన్నారు. నూతన పాలకవర్గ సభ్యులందరూ ప్రజలకు మంచి సేవలు అందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్గుల్ నరసయ్య, పి.సి గంగారెడ్డి, కాటిపల్లి చిన్న గంగారెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, వినోద్, రామచందర్, శేఖర్, ఇస్తాకుద్దీన్, భాస్కర్, దొండి గంగ మోహన్, రజనీష్ కిరాడ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన ఈఆర్ ఫౌండేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



