Sunday, June 8, 2025
E-PAPER
Homeసినిమాస్ఫూర్తిదాయకంగా 'సూరి ఓరి సూరి..'

స్ఫూర్తిదాయకంగా ‘సూరి ఓరి సూరి..’

- Advertisement -

దేవన్‌ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్‌ నేచురల్‌ లవ్‌స్టొరీ ‘కృష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్‌ లైన్‌.
ధన్య బాలకృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్‌ విజువల్స్‌ బ్యానర్‌ పై జ్యోత్స్న జి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుత మైన స్పందన వచ్చింది. తాజాగా జే.డి.లక్ష్మీ నారాయణ ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘సూరి ఓరి సూరి’ని లాంచ్‌ చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ ఈ సాంగ్‌ని ఎనర్జిటిక్‌ మోటివేషనల్‌ సాంగ్‌గా కంపోజ్‌ చేశారు. భాస్కర భట్ల రవి కుమార్‌ అద్భుతమైన సాహిత్యం రాశారు. జెస్సీ గిఫ్ట్‌ ఎనర్జిటిక్‌గా పాడారు. దీంతో ఈ సాంగ్‌ ఇన్‌స్టంట్‌ హిట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ‘యువత కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి రావాలనే సందేశం ఈ సాంగ్‌లో ఉంది. భాస్కర భట్ల రవి కుమార్‌ అద్భుతమైన సాహిత్యం రాశారు. ఈ సాంగ్‌ సినిమాకే కాదు యువతరానికి కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు. ‘ధైర్యం, ప్రజా సేవకు ప్రతీక అయిన జేడీ లక్ష్మీ నారాయణ మా చిత్రంలోని సాంగ్‌ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తన నిర్భయ సేవ, సత్యం పట్ల నిబద్ధత ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా ఆయన మా పాటను ఆవిష్కరించడం మేము ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం. ఇదొక పవర్‌ఫుల్‌ మోటివేషనల్‌ సాంగ్‌. ఒక తొలి దర్శకుడిగా, తెలుగు సినిమా లెజెండ్స్‌ నాకు గొప్ప ప్రేరణగా నిలిచారు. వారు మనకు గొప్పగా కలలు కనడం నేర్పారు. రాజమౌళి విజన్‌, సుకుమార్‌ పొయిటిక్‌ నెరేషన్‌, సందీప్‌ రెడ్డి వంగా రా అండ్‌ ఇంటెన్స్‌ ప్రజెంటేషన్‌.. ఇవన్నీ నా ప్రయాణాన్ని బలంగా ప్రభావితం చేశాయి. ఈ సినిమా ఆ అభిమానం నుండి పుట్టింది’ అని హీరో, డైరెక్టర్‌ దేవన్‌ చెప్పారు.
వినోద్‌ కుమార్‌, పధ్వి (పెళ్లి), రవి కాలే, తులసి, 7ఆర్ట్‌ సరయు, ఆనంద్‌ భరత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, సంభాషణలు- అనిల్‌ కిరణ్‌ కుమార్‌ జి, డీవోపీ – సతీష్‌ ముత్యాల, సంగీతం – భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌ – కేఎస్‌ఆర్‌, కొరియోగ్రఫీ -రఘు మాస్టర్‌, ఫైట్స్‌ – నందు మాస్టర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – రామకష్ణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -