నవతెలంగాణ – రాజోలి
రాజోలి గ్రామంలో 1981 పదవ తరగతి బ్యాచ్ మిత్రులందరికీ గ్రామ ప్రజల పెద్దల అనుకూలతతో రాజోలి గ్రామంలో 2018 జులై 15న గాంధీ విగ్రహాన్ని ప్రదిస్టించి ఆ ఏరియా కు గాంధీ చౌక్ అని పేరు పెట్టారు. అయితే శాంతినగర్ నుండి రాజోలి కి ప్రయాణించే వాహనాలు గ్రామ ప్రజలు గాంధీ చౌక్ దగ్గర ఉన్నటువంటి వాగు బ్రిడ్జి పై నుండి ప్రయాణం కొనసాగించాలి. కాగా ప్రస్తుత కాలంలో వాహనాలు అధిక సంఖ్యలో వాగుపై ప్రయాణించడంతో వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు బారికేడ్లు ట్రాఫిక్ కోన్స్ గాంధీ చౌక్ ఏరియా లోను మరియు సబ్ స్టేషన్ ఏరియాలో ఏర్పాటు చేయాలని 1981 బ్యాచ్ నుండి నాలుగు భారీ గేట్లను మరియు ట్రాఫిక్ ఓన్స్ ను అందిస్తామన్నారు. కావలసిన మిగతా సామాగ్రిని అధికారులతో మాట్లాడి సర్వస్తం చేయించాలని రాజోలి సబ్ ఇన్స్పెక్టర్ గోకారి కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఈశ్వరయ్య, జయరాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ సూర్యకాంతం పాల్గొన్నారు.
రాజోలి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం
- Advertisement -
- Advertisement -



