Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను మంగళవారం మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు తనిఖీ చేశారు. బాలికల వసతి, పౌష్టికాహారం తో పాటు, పాఠశాల అధికారులను ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్వాహకురాలు సామలకు సూచించారు. బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాబోవు పదో తరగతి పరీక్షలకు బాలికలను సిద్ధం చేయాలని ఆయన ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు శ్యామల, స్కూల్ అసిస్టెంట్ శేఖర్, అకౌంటెంట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -