Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅన్ని వర్గాలను అలరించే సరికొత్త ప్రేమకథ

అన్ని వర్గాలను అలరించే సరికొత్త ప్రేమకథ

- Advertisement -

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన నయా సినిమా ‘దీవాన`. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మీడియాతో పలు సినీ విశేషాలను షేర్ చేసుకున్నారు. పదేళ్ల కిందట వచ్చిన ప్రయో గాత్మక చిత్రం ‘మిణు గురులుచిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశా. పదేళ్లకుపైగా ఓ కార్పొరేట్ కంపె నీలో ఉద్యోగం చేశాను. చిన్న డెమో ఫిల్మ్స్, సాంగ్స్, షార్ట్స్ ఫిల్మ్స్ చేశా. ఈ 'దివాన కథ జెమిని టీవీలో ఓ యాంకర్ ను చూసి రాసుకున్నా. ఆమె రోజూ టీవీలో వచ్చేంది. ఎంబీఏ పూర్తి చేశాక జాబ్ కోసం ప్రయత్నించకుండా సినిమా కోసం ఆగిపోయా. పొద్దున లేస్తే టీవీ చూస్తుండగా యాంకర్ కనిపిం చింది. వెళ్లి ఆ అమ్మాయిని కలిస్తే ఎట్లుండది, కలిస్తే ఏమవ్వొచ్చు, గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి కలిస్తే ఏం జరుగుతుందనే ఆలోచన తట్టింది. దీంట్లో ఏమోషనల్ ప్లస్ కమర్షియల్ కథ ఉంది. ఇది రాయాలని అనుకున్నా. నా కథలో హీరోది వన్ సైడ్ లవ్వే. ఎక్స్టోవర్ట్ గా హీరోయిన్ వెనుక పడుతుంటాడు. సెకండాఫ్ లో వన్ సైడ్ లవ్వే ఉంటుంది కానీ వెనుక పడేది ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే సరికొత్త ప్రేమకథ ఇది. ఇలాంటి ప్రేమకథని చూసి ఉండరు. – ఈ సినిమాలో ఆరు పాటలుం టాయి. మూడు ఫైట్లు ఉంటాయి. ప్రతి మనిషిని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎమోషన్స్ బాగా నచ్చుతాయి. ఈ కథకి హర్షిత్ రెడ్డి పక్కా యాప్ట్. ఇందులో తను ఎంతో బాగా నటించాడు. అలాగే మా కథానాయిక స్మేహ మణిమేగలై కూడా అద్భుతంగా నటించింది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నేను దర్శకుడిగా ఇంత దూరం రావడం, నా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారకులైన నా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -