Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి

మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అంగన్ వాడి టీచర్ అన్నపూర్ణ అన్నారు.అమ్మమాట-అంగన్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దతూండ్లలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ హాజరై మాట్లాడారు. అంగన్ వాడిల్లో చేరిన పిల్లలకు మంచి ఆటపాటలతో కూడిన విద్యానందిస్తారని తెలిపారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్ వాడి కేంద్రాలు దోహదపడుతాయన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో అందించిన పోషకారరంతో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు వినియోగిoచుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీలు నిర్వహించి, నూతనంగా జాయిన్ ఆయిన చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -