Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభిన్న కథతో

భిన్న కథతో

- Advertisement -


‘కామ్రేడ్ కళ్యాణ్ శ్రీ విష్ణు నటిస్తున్న ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌. కోన వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఒరియా పిల్లా`ను ఈనెల 20న రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, మహిమ మధ్య కనిపించిన అందమైన కెమిస్ట్రీ, లవ్ వైబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: విజయ్ బుల్గానిన్, డీఓపీ : సాయి శ్రీరామ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -