నవతెలంగాణ – మిడ్జిల్
ప్రజా ప్రభుత్వం అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వేముల గ్రామంలో శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా బండలాగుడా పోటీలను సర్పంచ్ నాగమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. వాడియాల గేటు నుండి మసి గుండ్ల పల్లి వరకు డబల్ రోడ్డు మంజూరైనట్లు చెప్పారు. అదేవిధంగా వేముల నుండి వెల్జాల్ రోడ్డు వరకు రోడ్డు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. రైతుల కష్టానికి గౌరవం ఇవ్వడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడలు, సంప్రదాయాలు మన సంస్కృతికి ప్రతీకలని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రైతు పోటీలలో మొదటి బహుమతిగా రూ.1,10,116/- నగదు బహుమతిని అందజేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, రఘుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, పాండు, భీమ్ రాజ్, శ్యాంసుందర్రావు, మాజీ ఎంపిటిసి సభ్యులు చెన్నయ్య, ప్రేమ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు ఎడ్ల శంకర్, అంజన్ రెడ్డి, ధర్మానాయక్, శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.



