Tuesday, February 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం

క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
క్రీడలతోనే మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, స్నేహభావం అలవడుతుందని ఎంపీ గోడం నాగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని జాతర్ల లో నిర్వహించిన బిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతి మేమౌంటు, మెడళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో స్నేహభావాన్ని పెంపొందిస్తూ ఐక్యతను ఏర్పాటు చేయడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యువత చెడు అలవాట్లు లోను కాకుండా క్రీడల పై దృష్టి సారించి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఉన్నారు. అనంతరం మండలంలోని అనంతపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో నాయకులు ననేం రమణ, సూది నందు, కొత్త శంకర్, బొడ్డు బోజరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -