నవతెలంగాణ – రాయపోల్
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ప్రకాశింపచేయడానికి పొరుగు రాష్ట్రాల మధ్య సంస్కృతి,సంప్రదాయం,ఆచార,వ్యవహారాలను బదలాయింపు చేసుకునేందుకు “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” పేరున పీఎం శ్రీ స్కూల్స్ భాగస్వామ్యంలో, పీఎం శ్రీ నవోదయ వర్గల్ వారు రాయపోల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి యూత్ అండ్ ఈకో క్లబ్ ను నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, నవోదయ వర్గల్ ప్రధాన ఉపాధ్యాయులు పి.రాజేందర్ తెలిపారు. మంగళవారం రాయపోల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందర్శించి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వర్గల్ పిఎం శ్రీ నవోదయ పాఠశాల విద్యార్థులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సందర్శనకు వచ్చిన వర్గల్ పిఎంసి నవోదయ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముందుగా రాయపోల్ విద్యార్థులు హర్యానా భాషలో హర్యానా విద్యార్థులను ఆహ్వానించి,బతుకమ్మతో స్వాగతం పలికారు.ఇందులో భాగంగా ఫ్రెండ్లీ ఖో-ఖో,డ్రాయింగ్, సాంస్కృతిక కార్యక్రమాలలో ఇరు పాఠశాలలు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఇట్టి కార్యక్రమం ఆరోగ్యకరమైనది,అభినందించదగ్గదని కొనియాడారు. అనంతరం తెలంగాణ వంటకాలు పచ్చిపులుసు, ముద్దపప్పు, సకినాలు, చెకోడీలు,మొదలగువాటి రుచులు చూపించారు. ఈ కార్యక్రమంలో పిడి గోవర్ధన్ రెడ్డి,ఉపాధ్యాయులు నాగరాజు,నర్సింగారావు,వీరేందర్ సింగ్, పి ఈ ఎం,హేమావతి , మల్లేష్,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



