- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, వనపర్తి 18 వ వార్డు సీపీఐ(ఎం) కౌన్సిలర్ గా విజయం సాధించిన మదనకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారంం పూలమాలవేసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, జిల్లా ఉపాధ్యక్షులు కే వెంకటయ్య, డి కురుమన్న, సహకార కార్యదర్శి రాబర్ట్, సి పుల్లన్న, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



