Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమినీ ట్రక్కును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

మినీ ట్రక్కును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ కావడంతో మినీ ట్రక్కును రోడ్డు పక్కన ఆపి టైర్ మారుస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతులు దేవరపులకి చెందిన జాట్ రోహిత్(22), దంతాలపల్లి మండలం బీరి శెట్టి గూడెం గ్రామానికి చెందిన ధోనికెల రాజేందర్(27), గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన మధు (29)గా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -