Thursday, June 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన..

- Advertisement -
  • బీఆర్ఎస్‌వీ నాయకుల ముందస్తు అరెస్టు
    నవతెలంగాణ-రామకృష్ణాపూర్: తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు చేపట్టిన “ఛలో అసెంబ్లీ” ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో బీఆర్ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు జిలకర మహేష్, జిల్లా నాయకులు నస్పూర్ శివ, కంపల్లి శ్రీకాంత్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై తమ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -