జై ఈ ఈ ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థి అరవింద్ కుమార్
నవతెలంగాణ – బోనకల్
జాతీయ సేవా పథకం యువజన ఉత్సవాలలో బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొని ప్రతిభను చాటారు. కాకతీయ విశ్వవిద్యాలయం కో ఆర్డినేటర్ ఈసం నారాయణ రావ పర్యవేక్షణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి జాతీయ సేవా పథకం యువజన ఉత్సవాలు మంగళవారం ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీలలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పొటిలో జిల్లా స్థాయిలో జి దేవి ద్వితీయ బహుమతిని సాధించింది. క్విజ్ పోటీలో సిహెచ్ సాయికుమార్, బి హేమంత్ కుమార్, ఎన్ వీణ ద్వితీయ బహుమతిని సాధించారు.
ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కళాశాల విద్యార్థి వేమ అరవింద్ కుమార్ 69.24 పర్సంటేజ్ సాధించాడు. అరవిందు కుమారుని కళాశాల ప్రిన్సిపాల్ లింగంమనేని నళిని శ్రీ, అధ్యాపకులు మెమొంటో తో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. పట్టుదలతో చదివి ఈ పర్సంటేజ్ సాధించినట్టు తెలిపారు. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడం ద్వారా ఈ మార్కులు సాధించినట్లు తెలిపాడు. రెండవ సెషన్ కు కూడా హాజరవుతానని మంచి పర్సంటేజ్ ను పెంచుకొని ఐ ఐ టి సీటు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
ప్రిన్సిపాల్ లింగమనేని నళిని శ్రీ మాట్లాడుతూ.. బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోపాటు విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ, వ్యక్తిత్వ వికాసాన్ని, నాయకత్వ లక్షణాలను అవలంబించుకుంటూ, క్రమశిక్షణతో చక్కని విద్యార్థులుగా తీర్చిదిద్దటం జాతీయ సేవా పథకం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో చరిత్ర అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అంతోటి తిరుపతి రావు, అధ్యాపకులు జిడ్డు జోనాథన్ బాబు, అలానే రాజేంద్ర కుమార్, పంబి లక్ష్మీకాంతం, దొడ్డ పద్మావతి, ఉన్నం రామకృష్ణ, మొగిలి రమేష్, సారా రాజేంద్ర, గుండా ప్రియ కుమార్ రెడ్డి, తగరం యశోద, గ్రంథ పాలకులు అనుముల మోహన్, యు డి సి మదర్ సాహెబ్, ఎల్ డి సి జశ్వంత్, రికార్డ్ అసిస్టెంట్ బుజ్జమ్మ, అరుణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



