నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలియజేశారు. రాజ్యాంగ ఆదర్శాల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అపరిమితమైన అంకితభావం, అణగారిన గొంతుకల కోసం ఆయన చేస్తున్న రాజీలేని పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయని ఖర్గే నొక్కి చెప్పారు. “రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజ్యాంగ ఆదర్శాల పట్ల మీ అపరిమితమైన అంకితభావం, అణగారిన గొంతుకల కోసం మీరు చేస్తున్న రాజీలేని పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి.” అని కొనియాడారు.
అదే విధంగా పీఎం మోడీ కూడా రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు.



