Friday, June 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేటి నుంచి టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్..

నేటి నుంచి టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ ఎప్‌సెట్‌ (TG EAPCET) 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థులు ఈ నెల 25 నుంచి జులై 1వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

విద్యార్థులు నమోదు చేసిన ఆప్షన్లు, ర్యాంకులు, రిజర్వేషన్‌ నిబంధనల ఆధారంగా జులై 10న తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగుస్తుంది. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 10 నుంచి 14వ తేదీ వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -