Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిడుగుపాటుకు 6 మూగజీవాలు మృత్యువాత

పిడుగుపాటుకు 6 మూగజీవాలు మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
మండలంలోని కాన్వాయిగూడెం గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగు పడటంతో ఆరు మూగజీవాలు మృత్యువాత చెందాయి. గ్రామానికి చెందిన కాసాని వీరయ్య తన మూగజీవాలను మేత కోసం రోజూ మాదిరిగానే బయటకు తీసుకెళ్లాడు. వాటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో ఆ శబ్ధానికి తోడు పిడుగు వేడికి పచ్చి గడ్డి మేస్తున్న 6 జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీరయ్య వాటికి దూరంగా ఉండడంతో అతనికి ప్రమాదం తప్పింది. వీటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని ఆయన కన్నీమున్నీరయ్యాడు. పశుసంపద పై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతుకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని సర్పంచ్ కాసాని‌ హరీష్ కోరారు. కాగా మృతి చెందిన మూగజీవాలను పశువైద్య సహాయకులు అనిల్, జీపీవో భాస్కర్, ఉపసర్పంచ్ లింగయ్య తదితరులు పరిశీలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -