Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుపై వృధాగా మిషన్ భగీరథ నీళ్లు

రోడ్డుపై వృధాగా మిషన్ భగీరథ నీళ్లు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు రోడ్డుపై ఏరులై పారుతున్నాయి. ఆ నీళ్లకోసం ప్రజలు ఏండ్ల తరబడి ఎదురుచూశారు. కులాయిలో మాత్రం నీళ్ళు రావడం లేదు. స్థానికులు త్రాగడానికి నీళ్ళు లేక అవస్థలు పడుతున్నారు. ముందే ఇప్పడు వేసవ రాబోతోంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశముంది. ఈ క్రమంలో రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారడం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి నీటి లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -