Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫిన్‌లాండ్‌లో హైదరాబాద్‌ స్టూడెంట్ మిస్సింగ్

ఫిన్‌లాండ్‌లో హైదరాబాద్‌ స్టూడెంట్ మిస్సింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చదువు కోసం ఫిన్‌లాండ్‌కు వెళ్లిన మణిదీప్‌రెడ్డి (18) అదృశ్యమయ్యాడు. వనస్థలిపురానికి చెందిన మణిదీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విద్య కోసం 2025 ఆగస్టులో ఫిన్‌లాండ్‌లోని లతి పట్టణంలో ఎల్‌యూటీ యూనివర్సిటీలో చేరాడు. ఈ ఏడాది మే 5న రాజధాని హెల్సింకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతోంది. మే 11న స్నేహితుని ద్వారా లతి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆచూకీ లభించలేదు. ఫిన్‌లాండ్‌లోని ఇండియా ఎంబసీలో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, ఇటీవల రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి, తమ కుమారుని ఆచూకీ తెలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శుక్రవారం కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -