Saturday, June 20, 2026
E-PAPER
Homeజాతీయంమూడవ అంతస్తు నుంచి దూకి నీట్ విద్యార్థి సూసైడ్

మూడవ అంతస్తు నుంచి దూకి నీట్ విద్యార్థి సూసైడ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ‘నీట్’ పరీక్ష రద్దు మరో విద్యార్థినిని బలి తీసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అవంతిక మౌర్య(21) అనే విద్యార్థిని గురువారం రాత్రి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయారు. కాగా అవంతిక ఇప్పటికే 3 సార్లు నీట్ ఎగ్జామ్ రాసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్, రీఎగ్జామ్ అని తెలిసినప్పటి నుంచి ఆమె ఒత్తిడికి గురయ్యారని, తిండి కూడా సరిగా తినలేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -