Tuesday, April 21, 2026
E-PAPER
Homeక్రైమ్దారుణం..ప్రేమ జంట అనుమానాస్పద మృతి

దారుణం..ప్రేమ జంట అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని బళ్లారిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మంగళవారం రాత్రి మంగళముఖి సుహాసిని (29), ఆమె ప్రియుడు శేఖర్ (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎం.కె.నగర్ లోని వారి నివాసంలో సుహాసిని మృతదేహం కింద పడి ఉండగా, శేఖర్ ఉరివేసుకుని కనిపించాడు. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరి మధ్య ఇటీవల డబ్బు పంపకాలు, పెళ్లి విషయమై ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసింది. సుహాసినిని హత్య చేసి, అనంతరం శేఖర్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -