Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-ఆలేరు టౌను

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ  ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే, సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం రహదారి బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రైతు రాజ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. 33 రకాల సన్న ధాన్యాలను బోనస్‌తో కొనుగోలు చేస్తామని ప్రకటించి, ప్రస్తుతం కేవలం 7 రకాలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.

రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది మంది రైతులకు రైతు బీమా నిధులు ఇప్పటికీ అందలేదని, బాధిత కుటుంబాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో లేని  కారణంగా   తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో స్టాక్ ఏర్పాటు చేసి, రైతులకు యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో రైతును రాజుగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసారని కొనియాడారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించిన ఘనత  కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై  నెట్టడం సరికాదని, కేంద్రం ఎంత కొనుగోలు చేస్తే అంతే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, సెక్రెటరీ జనరల్ కుండె సంపత్, కౌన్సిలర్ యాట శివ, మొరిగాడి వెంకటేష్, పంతం కృష్ణ,  పాషికంటి శ్రీనివాస్,ఆడేపు బాలస్వామి, బిజన మధు, బేతి రాములు, ఎల్లయ్య, ఎండి ఫయాజ్,  నాగరాజు, టీంకు తదితరులు పాల్గొనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -