Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఎం పోషణ పకడ్బందీగా అమలు చేయాలి

పీఎం పోషణ పకడ్బందీగా అమలు చేయాలి

- Advertisement -

• మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
నవతెలంగాణ – పెద్దవంగర 
ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్  పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుక్-కమ్-హెల్పర్స్ (సీసీహెచ్‌లు)కు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం తో కూడిన భోజనం సకాలంలో అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్, హెచ్ఎం కళాధర్, సీఆర్పీలు వేముల సంతోష్, నిరంజన్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -