Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య

ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అర్హులైన ఉపాధ్యాయులచే మెరుగైన విద్య బోధన అందుతోందని మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ, మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం కొయ్యుర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలు వార్డుల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ప్రవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతోటి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు పంపించి ఆర్థికంగా నష్టపోకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలున్నాయన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి అధిక సంఖ్యలో పిల్లలను నమోదు పెంచి మన గ్రామం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో విద్యార్థుల నమోదులో ముందంజలో ఉండాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -