నవతెలంగాణ – మిరుదొడ్డి
ప్రాథమిక పాఠశాల మోతే గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిచారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ విశిష్ట అతిథులుగా మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య సమక్షంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల గురించి తల్లిదండ్రులు లేవనెత్తిన విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ విద్యార్థుల చదువుపట్ల క్రమశిక్షణ పట్ల శ్రద్ధ చూపాలని వారు సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో పిల్లల సంఖ్యను పెంచాలని ఎంఈఓ అంజయ్య సూచించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి దిగ్విజయం చేసినందుకు పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
చదువు పట్ల ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండాలి: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



