నవతెలంగాణ-నవాబు పేట
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది అని ఎంఈఓ నాగ్య నాయక్ అన్నారు. మండల పరిధిలోని చౌడూరు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులు, తల్లిదండ్రుల మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ సర్పంచ్ కోట సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని తీర్మానం చేసామని తెలిపడంతో వారిని ఎంఈఓ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నాగ్య నాయక్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలోని పాఠశాలను వదిలి,ఇరుకు గదుల ప్రైవేటు పాఠశాలకు వెళ్ళవద్దని, పాఠశాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని, పూర్వ ప్రాథమిక పాఠశాలను కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం గ్రామ సర్పంచ్ సునీత మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యార్థులు మన పాఠశాలకే పంపించేందుకు తీర్మానం చేస్తున్నామని ఇట్టి తీర్మానాన్ని పాటించని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయడం జరుగుతుందని, ఇట్టి తీర్మానాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
ప్రైవేటు పాఠశాలకు వెళుతున్న మొత్తం 14 మంది విద్యార్థుల తల్లిదండ్రులలో కుమార్, ఆచారి, మల్లేష్, నరేందర్, రాజేందర్ గౌడ్ మొదలైన వారితో మాట్లాడి అక్కడికక్కడే ఏడు మంది విద్యార్థులను మన పాఠశాలలో చేర్పించారు.తెలిపారు.జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమల్లిక, గ్రామ సెక్రెటరీ మాధవి , ఉప సర్పంచ్ లక్ష్మయ్య, వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు షబ్బీర్ అలీ,కోట ఆంజనేయులు, అమ్రేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.



