– శివాజీ మహారాజ్ తరతరాలకు స్ఫూర్తిదాయకం
– ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘ సేవకులు సుభాష్ రెడ్డి
నవతెలంగాణ – దోమకొండ
దోమకొండ మండలంలోని అంబరిపేట గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, సంఘ సేవకులు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశభక్తి, పరిపాలనా దక్షత, ప్రజాహితం కోసం ఆయన చూపిన నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు, మసానిపల్లి పెరుమాళ్ళు, స్థానిక నాయకులు, గ్రామ యువకులు, పెద్ద భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అంబరిపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యాదాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



