Monday, June 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‘మెట్రో’ పై కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ రెడ్డి మరో లేఖాస్త్రం

‘మెట్రో’ పై కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ రెడ్డి మరో లేఖాస్త్రం

- Advertisement -

కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌తో భేటీ ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మెట్రో ఫేజ్‌-2కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మరో లేఖాస్త్రం సంధించారు. మెట్రో ఫేజ్‌-2, ఐఆర్‌ఎఫ్‌సీ ఫైనాన్సింగ్‌కు సంబంధించిన అంశాలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేయాలని సీఎం కిషన్‌ ‌రెడ్డిని కోరారు. ఈమేరకు శనివారం సీఎం మరో లేఖ రాశారు. జూన్‌ 16న తాను రాసిన లేఖలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు సంబంధించిన సమస్యలను ప్రస్తావించానని గుర్తుచేశారు. పెండింగ్‌ అంశాలకు త్వరితగతిన పరిష్కారం అవసరమని, అందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తాను ఢిల్లీలో ఉంటానని, ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు. మెట్రో టేకోవర్, ఐఎఫ్ఆర్‌‌సీతో రుణ ఒప్పందాలు, మెట్రో ఫేజ్ 2 ప్రతిపాధనల ప్రతులను కూడా తాను తీసుకువస్తానని సవాల్‌ ‌విసిరారు. సమావేశం ఏర్పాటు చేసి తనకు సమాచారం ఇవ్వాలని ఆయన కిషన్‌రెడ్డిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -