Thursday, February 19, 2026
E-PAPER
Homeఖమ్మంకాసాని దంపతులకు బీఆర్ఎస్ శ్రేణుల సంఘీభావం 

కాసాని దంపతులకు బీఆర్ఎస్ శ్రేణుల సంఘీభావం 

- Advertisement -

బిర్రం వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆత్మీయ పలకరింపు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆత్మీయ పలకరింపులు వెల్లివిరుస్తున్నాయి. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజా సేవలో నిరంతరం ముందుండే కాసాని చంద్రమోహన్ – నాగశేషపద్మ దంపతులను వినాయకపురం బీ ఆర్ఎస్ శ్రేణులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్య నేత బిర్రం వెంకటేశ్వరరావు నాయకత్వంలో వినాయకపురం కు చెందిన నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో కాసాని నివాసానికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా వారు కాసాని దంపతులకు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజల పట్ల వారు చూపే సేవా దృక్పథం ఎంతో గొప్పదని గ్రామస్తులు ఈ సందర్భంగా కొనియాడారు. పదవులు ఉన్నా లేకపోయినా తామంతా కాసాని కుటుంబానికి వెన్నంటే ఉంటామని, భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకత్వం అశ్వారావుపేటకు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఆత్మీయ భేటీలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. తమను కలిసి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కాసాని దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -