Wednesday, April 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మానవత్వం చాటుకున్న దేగామా ఉప సర్పంచ్

మానవత్వం చాటుకున్న దేగామా ఉప సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – బజార్‌హత్నూర్:  మండలం దేగామా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బొడ్డు భోజన్న తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన గోదుమాల లక్ష్మణ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. లక్ష్మణ్ అనారోగ్యంతో మంచానికే పరిమితమవడం, అలాగే కుటుంబానికి ఆదారంగా ఉన్న కుమారులు మరణించడం వల్ల ఆ కుటుంబం దయనీయ స్థితిలోకి చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ భోజన్న తన వంతుగా రూ.5,000 నగదు సహాయం అందించారు. అదేవిధంగా వార్డ్ సభ్యుడు కొడారి శ్రీకాంత్,  అతని మిత్రబృందం కలిసి ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. వారి ఈ సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ మేకల వెంకన్న, నానం రమణయ్య, ప్రశాంత్, హరీష్, అనిల్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -