Friday, February 20, 2026
E-PAPER
Homeసినిమా40 మంది కొత్త నటీనటులతో..

40 మంది కొత్త నటీనటులతో..

- Advertisement -

‘ఫలక్‌నుమా దాస్‌, దాస్‌ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్‌సేన్‌ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తారక్‌ సినిమాస్‌ బ్యానర్‌ పై సందీప్‌ కాకరాల నిర్మిస్తున్నారు. భారతదేశంలో తొలి స్లాషర్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని కొత్త ప్రయత్నంగా నిలవనుంది. గురువారం మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విశ్వక్‌సేన్‌ చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి, అతడు వేసే ప్రతి అడుగుతో రక్తం వ్యాపిస్తూ పోస్టర్‌కు డార్క్‌ టోన్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు.

ఈ సినిమాతో విశ్వక్‌సేన్‌ మరో పెద్ద అడుగు వేస్తూ 40 మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. గాయత్రి భరద్వాజ్‌, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, కార్తికేయ, అనిరుధ్‌ భాస్కర్‌, తుర్లపాటి, కబీర్‌ భారతీయ, విశాక్‌ నాయర్‌, చేపూరి వివేక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, జపనీస్‌, స్పానిష్‌, ఇంగ్లీష్‌ భాషల్లో మల్టీలింగ్వల్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్‌సేన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: అవినాష్‌ యార్లగడ్డ, డైలాగ్స్‌: తరుణ్‌ భాస్కర్‌, సంగీతం: రవి బస్రూర్‌, డీఓపీ : అరవింద్‌ విశ్వనాథన్‌, ఎడిటర్‌: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అరవింద్‌ మూలే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -