అగ్రకథానాయకుడు ఎన్టీఆర్, ‘కెజియఫ్ సిరీస్, సలార్’ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండిస్టీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్ గురించి వివరాలను తెలియజేశారు.
‘ఎన్టీఆర్‌నీల్’ ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఆ గ్లింప్స్ ఒక పవర్ఫుల్ సినిమాటిక్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ ఎగ్జైట్మెంట్ను మరింత పెంచుతూ టీమ్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్‌నీల్ సినిమా జూన్ 11, 2027న శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ డబుల్ సర్ప్రైజ్తో మే 20న ‘ఎన్టీఆర్‌నీల్’ ప్రపంచాన్ని చూడాలని ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్, నీల్ కాంబోపై ఉన్న ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ స్లిమ్‌గా కనిపించబోతున్నారు. తీర్చిదిద్దిన శరీరంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం ఫ్యాన్స్‌కి ఒక పెద్ద ట్రీట్‌లా ఉండబోతోందనటంలో సందేహం లేదు.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సహా పలు భాషల్లో మూవీ విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ ఊహించినట్టుగా ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో ఎలా మెప్పించబోతున్నారోనని ఫ్యాన్స్ చూడాలని ఆతతతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీలో భారీ యాక్షన్‌తో పాటు ఆకట్టుకునే కథ, భావోద్వేగాలుంటాయి. ఆ ఏడాదిలోనే అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, ప్రొడక్షన్ డిజైన్: చలపతి.
డబుల్ సర్ప్రైజ్
- Advertisement -
- Advertisement -



