అర్జున్ అంబటి హీరోగా గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’.
ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా, పులగం సుప్రియ సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ,’ ‘ప్రసన్న ఈ గురించి నాకు చెప్పారు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతున్నారు. నాగ శివకి మంచి విజయం దక్కాలి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు. ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అనిదర్శకులు సముద్ర చెప్పారు.
దర్శకులు వీర శంకర్ మాట్లాడుతూ,’శివ తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అర్జున్ ప్రతీ ఫ్లాట్ ఫాం మీద తన సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ప్రసన్న, శివ, వీర శంకర్ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ఈ సినిమాతో మేం ఓ మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది’ అని హీరో అర్జున్ అంబటి చెప్పారు.
జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ,. ‘ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాగ శివ నా పాత్రను అద్భుతంగా రాశారు. ఇలాంటి ఓ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని దర్శకుడు నాగ శివ అన్నారు.
సరికొత్తగా ‘పరమపద సోపానం’
- Advertisement -
- Advertisement -



