Wednesday, April 22, 2026
E-PAPER
Homeసినిమాకేవలం 6 రోజులు..

కేవలం 6 రోజులు..

- Advertisement -

హీరో రామ్‌ చరణ్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌-ఇండియా స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా సంచలనం సష్టించాయి. రెండు గ్లింప్స్‌లలో రామ్‌ చరణ్‌ డిఫరెంట్‌ అవతార్స్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేశారు.
ముఖ్యంగా రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన గ్లింప్స్‌ ఎక్స్‌ ట్రార్డినరీ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్‌ ఇంకో 6 రోజుల్లో పూర్తవనుంది. చిత్రీకరణతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఎలాంటి కాంప్రమైజ్‌ కాకుండా అత్యుత్తమంగా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాడమే లక్ష్యంగా మేకర్స్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో థియేటర్లలో విడుదల కానుంది.
సెట్స్‌ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్‌లో షూటింగ్‌ స్పాట్‌లోని పాజిటివ్‌ ఎనర్జీ కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సానాతో కలిసి రామ్‌ చరణ్‌ ఆనందంగా కనిపిస్తూ, చిత్రీకరణ వాతావరణాన్ని తెలియజేస్తున్నారు. చరణ్‌ లుక్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు, బోమన్‌ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన, సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాత: వెంకట సతీష్‌ కిలారు, సహ నిర్మాత: ఇషాన్‌ సక్సేనా, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, డీఓపీ : ఆర్‌ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -