Friday, February 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅదే 'నవాబ్‌ కేఫ్‌' ప్రత్యేకత

అదే ‘నవాబ్‌ కేఫ్‌’ ప్రత్యేకత

- Advertisement -

శివ కందుకూరి, రాజీవ్‌ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రల్లో హర్షిక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్‌ కేఫ్‌’. ప్రమోద్‌ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని నేడు (శుక్రవారం) రిలీజ్‌ చేయబోతున్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, ‘సినిమా పట్ల మా టీం అంతా కూడా వంద శాతం సంతప్తిగా ఉంది. ఈ మూవీతో ఓ సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ రూపంలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. నిర్మాత వెంకట్‌ మా కోసం ఈ సినిమాకి బ్యాక్‌బోన్‌లా నిలిచారు. మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలెప్పుడూ ఫెయిల్‌ కావు అని నమ్ముతుంటాను.

ఈ మూవీ చూసిన తరువాత ఫాదర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడతారు. ఈ సినిమాలోని ఎమోషన్‌ కచ్చితంగా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఆడియెన్స్‌ మాకు ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ‘డీఓపీ క్రాంతి అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఎంతో సహనంతో సపోర్ట్‌ ఇచ్చారు. సురేష్‌ అన్ని పాటలకు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. మా ప్రొడక్షన్‌ డిజైనర్‌ సుప్రియ, రైటర్‌ ఇమ్రాన్‌, నిర్మాత వెంకట్‌కు థ్యాంక్స్‌. పవన్‌ ఈ మూవీని చక్కగా కట్‌ చేశాడు. మా హీరో శివకి ఎంతో ఓర్పు ఉంది. రాజీవ్‌ ఈ సినిమాకి సోల్‌. కసిరెడ్డి మంచిగా నవ్విస్తారు. తేజ చక్కగా నటించారు’ అని దర్శకుడు ప్రమోద్‌ హర్ష చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -