Monday, June 22, 2026
E-PAPER
Homeఆటలుతెలంగాణ షూటింగ్‌ ఆరంభం

తెలంగాణ షూటింగ్‌ ఆరంభం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌ ఆదివారం గచ్చిబౌలిలోని క్రీడా ప్రాధికార సంస్థ షూటింగ్‌ రేంజ్‌లో ఆరంభం అయ్యాయి. జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ఉపాధ్యక్షుడు, తెలంగాణ రైఫిల్‌ సంఘం (టిఆర్‌ఏ) అధ్యక్షుడు అమిత్‌ సంఘి తొలి షాట్‌ షూట్‌ చేసి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల 27 వరకు జరిగే ఈ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌, 10 మీటర్ల పిస్టల్‌, ట్రాప్‌, స్కీట్‌ ఈవెంట్ల ఒలింపిక్‌, నాన్‌ ఒలింపిక్‌ విభాగాల్లో సుమారు 1500 మంది షూటర్లు పోటీపడనున్నారు. ఎన్‌ఆర్‌ఏఐ నిర్దేశించిన స్కోరు సాధించిన షూటర్లు సౌత్ జోన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌తో పాటు జాతీయ షూటింగ్‌ పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపిక కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -