స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్, పాక్, ఖతార్ నేతలు తుది శాంతి ఒప్పందం కోసం కసరత్తు
ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్‌లో కాల్పుల విరమణ సహా అపరిష్కృతంగా ఉన్న కీలక అంశాలపై నిర్ణయం
నవతెలంగాణ-జనరల్ డెస్క్
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు ఉద్దేశించిన తుది ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇరాన్, అమెరికా ప్రతిఁధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో చర్చలు ప్రారంభించారు. ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్‌లో కాల్పుల విరమణ సహా అపరిష్కృ తంగా ఉన్న కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చర్చలలో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షు డు జేడీ వాన్స్ ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. తెల్లవారుజామున ఎమ్మెన్ వైమానిక స్థావరంలో సతీమణి ఉషా వాన్స్‌తో కలిసి దిగిన ఆయన సాయుధ గార్డులు పహరా కాస్తున్న అనేక చెక్ పాయింట్లు, పచ్చని కొండలను దాటుకుంటూ ఓ ఇరుకైన రహదారి మీదుగా రిసార్టుకు చేరుకున్నారు. బర్జెన్‌స్టాక్ పట్టణం లోని విలాసవంత మైన హోటల్ కాంప్లెక్స్‌లో చర్చలు జరుగుతున్నా యి. వాన్స్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా చర్చలలో భాగస్వాములవుతున్నారు. తొలి విడత చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనిక దళాల ప్రధానాధికారి అశిమ్ మునీర్ కూడా స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ‘ఇస్లామా బాద్ ఎంఓయూ’ అమలుపై జరిగే ఉన్నత స్థాయి చర్చలలో వీరు కూడా పాల్గొంటారని పాక్ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలిపింది. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ కూడా చర్చలలో పాల్గొనే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. చర్చలలో ఇరాన్ బృందానికి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్, విదే శాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వం వహిస్తుండగా సీఁయర్ సెక్యూరిటీ, సెంట్రల్ బ్యాంక్, చమురు అధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఎంఓయూలోని మరిన్ని విషయాలను బయటపెట్టిన పెజెష్కియాన్
అమెరికాతో కుదుర్చుకున్న ఎంఓయూలో ఉన్న మరికొన్ని అంశాలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బయటపెట్టా రు. ఆయన అందించిన వివరాల ప్రకారం స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులలో ఆరు బిలియన్ డాలర్లు ఖతార్ వద్ద ఉన్నాయి. ఎంఓయూ ప్రకారం ఇప్పుడు అవి ఇరాన్ కు తిరిగి వస్తాయి. ‘ఎంఓయూలో నిబంధనలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. చర్చలు, సంప్రదింపులలో మేము సాధించినవి త్వరలోనే తెలుస్తాయి’ అని పెజెష్కియాన్‌ను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. గతంలో అమెరికా వేటినైతే నిషేధించిందో ఇప్పుడు వాటినే ఇరాన్ ప్రజల హక్కు లుగా ప్రకటించిందని ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్ చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూయేనని వ్యాఖ్యాఁంచారు. ‘మా వద్ద అణుబాంబు ఉండకూడదన్నది అమెరికా ప్రధాన ఉద్దేశం. మాకు అణుబాంబు వద్దని అమరుడైన మా సుప్రీం నేత పదే పదే చెప్పారు. అదే విషయాన్ని లిఖితపూర్వకంగా చెప్పాలని అమెరికా అడిగింది. మేము అలాగే రాసి ఇచ్చాం’ అని అన్నారు. కాగా ఎంఓయూలోఁ 14 పాయింట్లలో మొదటి దానినే అమెరికా అమలు చేయలేకపోతోందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సలహాదారు మహమ్మద్ మఖ్మర్ ఎద్దేవా చేశారు. లెబనాన్‌లో దాడులు సహా అన్ని రకాల సైఁక చర్యలు ఆగిపోతాయని ఎంఓయూలో అమెరికా హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమైనంత కాలం మధ్యప్రాచ్య చమురు సరఫరాలు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ఎంఓయూలో ఇచ్చిన హామీల అమలుకు పట్టుబడతామని ఇస్మాయిల్ బాఖై చెప్పారు.
హార్ముజ్‌పై భిన్న వాదనలు
తుది విడత చర్చలు జరిపేందుకు వీలుగా కాల్పుల విరమణను ఇరాన్, అమెరికా దేశాలు మరో 60 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇప్పటికే ప్రకటించింది. అయితే హార్ముజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయని, శనివారం యాభై ఐదు నౌకలు హార్ముజ్ మీదుగా ప్రయాణించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. ఈ నౌకలలో 17 మిలియన్ బ్యారల్స్ చమురు అంతర్జాతీయ మార్కెట్లకు రవాణా అవుతోంది.
లెబనాన్‌లో కొనసాగిన ఇజ్రాయిల్ దాడులు
ఓ వైపు ఇరాన్, అమెరికా, పాకిస్తాన్, ఖతార్ నేతలు స్విట్జర్లాండ్‌లో చర్చలు ప్రారంభించగా మరోవైపు దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ సేనలు బాంబు దాడులు కొనసాగించాయి. ఇజ్రాయిల్ వైపు నుంచి అనేక డ్రోన్లు లెబనాన్‌లోని లక్ష్యాల వైపు దూసుకొచ్చాయి. ఇజ్రాయిల్ దాడుల కారణంగా గత రెండు రోజులలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన దాడులలో 16 మంది చనిపోగా 12 మంది గాయపడ్డారు. టైర్ జిల్లాలోని బరిష్ గ్రామంపై జరిగిన దాడిలో ఒకే కఁటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. అలాగే పశ్చిమ బెక్కా వ్యాలీలోని సొహ్‌మార్‌లో ఓ ఇంటిపై జరిగిన దాడిలో అందులో నివసిస్తున్న నలుగురు మరణించగా ఒకరు గాయపడ్డారు. సిడన్ జిల్లాలోని ఖానారిట్‌పై జరిగిన దాడిలో ఏడుగురు చనిపోగా 13 మంది గాయపడ్డారు. శుక్రవారం వివిధ ప్రాంతాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడులలో 83 మంది మరణించగా 141 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
డీల్ కుదరకపోతే
హార్ముజ్‌లో సుంకాలు విధిస్తాం : ట్రంప్
అరవై రోజుల కాల్పుల విరమణ గడువు ముగిసే లోగా ఇరాన్‌తో తుది ఒప్పందం జరగకపోతే హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై టోల్స్ (సుంకాలు) విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం సుంకాలు ఉండవు. వాటిని విధించేది మేమే. మేము ఆ పని చేసే వరకూ అవి ఉండవు. ఒప్పందం కుదరని పక్షంలో మాత్రం మధ్యప్రాచ్య దేశాలకు అందించిన సేవల నిమిత్తం…గత, ప్రస్తుత, భవిష్యత్ ఖర్చుల భర్తీ కోసం…అమెరికా స్వయంగా సుంకాలు విధిస్తుంది’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో తెలిపారు.
చర్చల ఎజెండాపై ఇరాన్ ఏమంది?
ఇజ్రాయిల్`హిజ్బుల్లా మధ్య లెబనాన్‌లో జరుగుతున్న ఘర్షణలు ఈ చర్చల ఎజెండాలో అగ్ర స్థానంలో ఉంటాయని ఇరాన్ తెలియజేసింది. ఇచ్చిన హామీలన్నిం టినీ ఇజ్రాయిల్ ప్రభుత్వం ఉల్లంఘిస్తూనే ఉన్నదని, కాబట్టి చర్చలలో అదే ప్రధానాంశం అవుతుందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై చెప్పారు. స్తంభింపజేసిన ఆస్తులను ఇరాన్ కు అందుబాటులోకి తేవడం, ఇరాన్ చమురు అమ్మకాలకు అవసరమైన లైసెన్సులు జారీ చేయడం కూడా చర్చల ఎజెండాలో ఉన్నాయని వివరించారు. కాగా కాల్పుల విరమణ కొనసాగుతుందన్న నమ్మకం ఉన్నదని స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లడానికి ముందు వాన్స్ చెప్పారు. హార్ముజ్‌ను ఇరాన్ మూసివేసిందని చెప్పడానికి ఆధారాలేవీ లేవని ఆయన అన్నారు.



