ఐఆర్‌జీసీని బలోపేతం చేస్తున్న అమెరికా ప్రలోభాలు
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్ మధ్య రూపుదిద్దుకుం టున్న ముసాయిదా ఒప్పందంలో ఓ వైరుధ్యం కనిపి స్తోంది. ఒప్పందానికి ఇరాన్ లొంగిపోయేలా చేయడానికి పెడుతున్న ప్రలోభాలు చివరికి ఆ దేశాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు కనిపి స్తున్నాయి. ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డులు అనేక సంవత్సరాలుగా అమెరికా విధించిన ఆంక్షల మధ్యే బలోపేత మయ్యారు. చమురు, నిర్మాణాలు మొదలుకొని షిప్పింగ్, టెలీకమ్యూనికేషన్లు, ఓడరేవుల వరకూ విస్తరించిన ఓ భారీ వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించారు. తాజాగా ఇరాన్అమెరికా మధ్య కు దిరిన ఎంఓయూ ప్రకారం ఇరాన్ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ఓ నిధిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఇరాన్ కు అనేక బిలియన్ డాలర్లు సమకూరుతాయి. దాని ఆర్థిక వ్యవస్థ తిరిగి బలం పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అతి పెద్ద లబ్దిదారులలో ఒకటిగా అవతరించబోతోంది. ఇంతింతై...వటుడింతై... ఇరాన్‌పై గతంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేసినా, టెహ్రాన్ నుంచి చమురు ఎగుమతులు తిరిగి ప్రారంభమైనా, విదేశీ పెట్టుబడులు వచ్చినా లభించే ఆర్థిక ప్రయోజనాలలో అతి పెద్ద వాటాను దక్కించుకు నేది ఐఆర్‌జీసీయేనని సీనియర్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఒప్పందం అమలుకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే వాటిని తొలగించడంలో రివల్యూషనరీ గార్డులే కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఇరాన్ వ్యాపారంతో వారు ఎంతగానో మమేకమయ్యారు. ఇరాన్ దివంగత విప్లవ నేత అయతొల్లా రుహ=ల్లా ఖొమేనీ స్థాపించిన ఐఆర్‌జీసీ...ఆయన వారసుడు అయతొల్లా అలీ ఖమేనీ హయాంలో బలమైన సంస్థగా ఆవిర్భవించింది. మధ్యప్రాచ్యం అంతటా తన అధికారాన్ని విస్తరించింది. స్వదేశంలో చెలరేగిన అసమ్మతిని అణచివేయడానికి జరిగిన ప్రయత్నాలకు నేతృత్వం వహించి రాజకీయ అధికారాన్ని కూడా చేజిక్కించుకుంది. అసలైన విజేత ఐఆర్‌జీసీయే ఫిబ్రవరి 28న అమెరికాఇజ్రయిల్ దాడులలో సుప్రీం నేత అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత రివల్యూషనరీ గార్డులు తమ అధికారాన్ని మరింత విస్తరించారు. అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీని సుప్రీం నేతగా నియమించడంలో సాయపడ్డారు. యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ఒప్పందానికి కూడా వారు మద్దతు తెలిపారు. ఈ యుద్ధంలో అసలైన విజేతలు రివల్యూషనరీ గార్డులేనఁ ఉన్నత స్థాయి వర్గాలు అభివర్ణించాయి. ఇరాన్ ఇస్లామిక్ వ్యవస్థ మనుగడను కాపాడింది వారేనని, కాబట్టి ఆంక్షల ఎత్తివేత ప్రయోజనాలు కూడా వారికే దక్కు తాయని తెలిపాయి. ఐఆర్‌జీసీ ఇంజినీరింగ్ విభాగమైన ఖతమ్ అల్`అన్బియా ప్రధాన మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టు లలో పనిచేస్తున్న వందలాది అనుబంధ సంస్థలను పర్యవేక్షిస్తుంది. అంతేకాక టెలికమ్యూనికేషన్లు, కార్ల తయారీ, పర్యాటకం, లాజిస్టిక్ రంగాలలో కూడా దాఁ భాగస్వామ్యం ఉంది.
అనుకూలంగా ఉన్న పెట్టుబడుల చట్టం
ఇరాన్ పెట్టుబడుల చట్టం ప్రకారం విదేశీ సంస్థలు స్థానికులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌జీసీతో సంబంధం ఉన్న కంపెనీల సంఖ్య ఎక్కు వగా ఉన్నందున ఇరాన్‌లోని అత్యంత లాభదాయక రంగాలలో ప్రవేశించాలఁ అనుకునే పెట్టుబ డిదారులకు ఆ కంపెనీలు ద్వారపాలకులు అవుతాయి. అంటే ఇరాన్ మార్కెట్‌లో ప్రవేశించే పాశ్చాత్య దేశాల సంస్థలు ఐఆర్‌జీసీ అనుబంధ కంపెనీలతో కలిసి కానీ లేదా వాటి ద్వారా కానీ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాతో తుది ఒప్పందం కుదరక ఆంక్షలు కొనసాగిన పక్షంలో సైతం చమురు ఎగుమతులపై తాత్కాలిక మినహాయింపులు అమలులో ఉన్న కారణంగా రివల్యూషనరీ గార్డులు ప్రయోజనం పొందుతారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించడంలో వారికి అపార అనుభవం ఉంది. దాని ద్వారా వారు ఆర్థిక వ్యవస్థపై పట్టును నిలుపుకోగలుగుతారు.
ఆర్థికంగా లాభించిన ఆంక్షలు
2000వ దశకం ప్రారంభం నుంచి ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. వాటి వల్ల రివల్యూషనరీ గార్డులు ఆర్థికంగా బాగా ఎదిగారు. ఎందుకంటే మధ్యవర్తులు, బినామీ కంపెనీల ద్వారా చమురు ఎగుమతులు, రవాణా, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి వారు ఓ నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నారు.
అమెరికా ఆంక్షల తొలగింపుతో…లబ్ది పొందేది రివల్యూషనరీ గార్డులే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



