Friday, February 20, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: డీఎస్పీ

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: డీఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద 25 ఫిబ్రవరి2026 నుండి 18 మార్చి2026 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో  జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదనీ, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదనీ, పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు మూసివేయాలనీ ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -