Friday, February 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌లో డ‌జ‌న్ అర‌టి పండ్లు రూ.300

పాక్‌లో డ‌జ‌న్ అర‌టి పండ్లు రూ.300

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ప‌విత్ర‌మైన రంజాన్ మాంసంలో పాకిస్థాన్‌లో ధ‌ర‌లు మండిపోతున్నాయి. అంత‌కుముందు తీవ్ర ద్ర‌వ్యోల్బ‌ణంతో నిత్యావ‌స‌ర స‌రుకుల రేట్లు పెరిగిపోగా..తాజాగా పండుగ పూట పండ్లు, కూర‌గాయాల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. డ‌జ‌న్ అర‌టి పండ్లు పాక్ క‌రెన్సీలో రూ.300 అమ్ముతున్నారు. క్విన్వో, ఆరెంజ్‌లు కిలో రూ.350 నుంచి రూ.400 ప‌లుకుతున్నాయి. స్టారాబెర్రి కిలో రూ.1000, ద్రాక్ష, దానిమ్మ కిలో రూ.700 నుంచి 750ల‌కు ఆయా మార్కెట్‌లో ల‌భ్య‌మైతున్నాయని ఆ దేశ‌ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. హ‌ఠాత్తుగా పెరిగిన ఆ ధ‌ర‌ల‌తో ఆ దేశ వాసులు మండిప‌డుతున్నారు. పరిపాలనా అసమర్థత, పెరుగుతున్న అధిక ద్రవ్యోల్బణం బంబుతో పవిత్ర మాసం ప్రారంభమైందని విమ‌ర్శిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -