నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సోపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం గ్రామ సర్పంచ్ దంతోడే తుకారం అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించామని జిపి కార్యదర్శి అశోక్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సభకు అధికారికంగా ఎంపీ ఓ రాము పాల్గొన్నారు. గ్రామ సభలో గ్రామ సర్పంచ్ తుకారం మాట్లాడుతూ.. ఉపాధి హామీ, లేబర్ మబ్లైజేషన్, నర్సరీ, ఇందిరమ్మ ఇల్లు, మంచినీటి నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు గురించి చర్చించినైనది అని తెలిపారు. అనంతరం గ్రామాన్ని నిత్యం పారిశుద్ధంగా ఉంచాలని, ఇంటి పన్నుల వసుళ్లపై దృష్టి సారించాలని జిపి కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సోపూర్ లో గ్రామసభ.. పలు సమస్మలపై తీర్మాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



