నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు కామ్రేడ్ ఎం.వి. రమణ మాతృమూర్తి మేకపోతుల కమలమ్మ వృద్ధాప్య కారణాలతో శనివారం రాత్రి 7.15 గంటలకు తమ నివాసంలో కన్నుమూశారు. కమలమ్మ మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కమలమ్మ మరణం కామ్రేడ్ ఎం.వి. రమణ కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన కమలమ్మ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఘన నివాళులు అర్పించింది. అలాగే కామ్రేడ్ ఎం.వి. రమణకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించింది.
మేకపోతుల కమలమ్మ మృతి పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



