నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. యోగా ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు.
గనిలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థకు చెందిన యోగా శిక్షకులు శ్రీ లక్ష్మణ్ యోగా సాధనలను నిర్వహించి, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ.. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని, ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఎస్.ఎన్.మూర్తి, మైన్ మేనేజర్ జి.శ్రీనివాస్, సేఫ్టీ అధికారి కె.సురేష్ బాబు, ప్రాజెక్టు ఇంజనీర్ కె. కిషన్, సర్వేయర్ఎం.సర్వోత్తమ్, డిజిఎం రమేష్ బాబు, హెచ్‌ఆర్ విశ్వ ప్రసాద్, పర్యావరణ అధికారి రామ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.



